మామూలు ఆదర్శ కుటుంబం కాదు.. వేరే లెవెల్
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కు టుంబం హౌస్ నెం.47 -ఏకే47’(Adharsha kutumbam house no.47 -AK 47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ‘ఈ సినిమా అక్టోబర్ 9న ప్ర పంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి మొదటి గీతం ‘నారాయణమ్మ’ విడుదలైంది. ఈ గీతావిష్కరణ వేడుక ఆ దివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘దాదా పు 20 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది.
నువ్వు నాకు న చ్చావ్, మల్లీశ్వరి సినిమాలు క్లాసిక్ లవ్ స్టోరీలు. అలాంటి సినిమాల తర్వాత ఇప్పుడు త్రివిక్ర మ్ మరో అద్భుతమైన కథను తీసుకొచ్చారు. ఇందులో ఎంటర్టైన్మెంట్, యాక్షన్, సెంటిమెం ట్ అన్నీ ఉంటాయి. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుం ది. ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు ఉంటాయి. సినిమా చూసి అంతా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఆదర్శ కుటుంబం.. ఇది మామూలు కుటుంబం కాదు. వేరే లెవెల్’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘అందరిలాగే నా ఫేవరె ట్ హీరో వెంకటేశ్. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొ త్తల్లో, నేను మొట్టమొదటిగా పెన్ను పెట్టి రాసిన డైలాగ్ ఆయన సినిమాకే. పవిత్ర బంధం. నా జర్నీ ఆయనతోనే స్టార్ట్ అయింది’ అన్నారు.