17 April, 2026 | 6:06 PM

సిబిల్ స్కోర్‌తో సంబంధం లేదు

15-05-2025 01:21 AM
  1. తప్పుడు ప్రచారం నమ్మొద్దు
  2. పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ నర్సారెడ్డి 

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథ కానికి సిబిల్ స్కోర్‌తో సంబంధం లే దని పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ శేర్ నర్సారెడ్డి స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వంపై కొందరు కావాలనే బురదజ ల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికా సం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ పథకానికి సంబంధించి మండల స్థాయిలోనూ ప్రక్రియ ప్రా రంభమైందని తెలిపారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న అర్హు లైన యువతకు ప్రభుత్వం మంజూరు పత్రాలను పంపిణీ చేస్తుందన్నారు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందనే ప్రచారాన్ని యువత నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.