calender_icon.png 10 February, 2026 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు బాధ్యతతో పనిచేయాలి

10-02-2026 12:00:00 AM

కలెక్టర్ బి. ఎం. సంతోష్

గద్వాల, ఫిబ్రవరి 9 : మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు బాధ్యతతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు, రిటర్నింగ్ అధికారు లతో కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రానికి సిబ్బంది సకాలంలో చేరుకొని రిపోర్టింగ్ చేసేలా ఆర్వోలు కృషి చేయాలన్నారు.

పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రానికి బ్యా లెట్ బాక్సులు తీసుకొచ్చిన తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ వేసే వర కు రిటర్నింగ్ అధికారులు బాధ్యతతో పని చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహించే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, ఎన్నికల నోడల్ అధికారులు శ్రీనివాసరావు, రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

గద్వాల, ఫిబ్రవరి 9 ( విజయక్రాంతి ) : మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ చాలా కీలకమైనదని, ఎలాంటి తప్పిదాలకు చోటు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవా రం ఐడిఓసి సమావేశపు మందిరంలో బ్యా లెట్ పేపర్స్ కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లె క్కింపు చేపట్టే సిబ్బంది కేంద్రాలకు నిర్దేశిత సమయంలోగానే చేరుకుని, ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభించాల న్నారు. మూడు వార్డులకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారి లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షి స్తారని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పి డి ప్యూటీ సీఈవో నాగేంద్రం, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రమేష్ బాబు, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.