24 March, 2026 | 8:13 PM

Breaking News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన   •   జన గణనను పకడ్బందీగా పూర్తి చేయాలి   •   ప్రభుత్వానికి నాణ్యమైన సమాచారం అందించేలా కృషి చేయాలి   •   ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •  

28న ఏఎన్నార్ అవార్డు ప్రదానం

26-10-2024 12:00 AM

దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు శత జయంతోత్సవాల ముఖ్య ఘట్టానికి వేళయింది. ఏఎన్నార్ పేరిట ఇచ్చే అవార్డు వేడుక ఈనెల 28న నిర్వహిం చనున్నారు. హైదరాబాద్ వేదికగా జరగ నున్న ఈ అవార్డు ప్రదానోత్సవానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.  ఆయన చేతులమీదుగా మెగాస్టార్ చిరంజీవికి అవార్డు ప్రదానం చేయను న్నారు.

ఈ విషయాన్ని సెప్టెంబర్ 20న జరిగిన ఏఎన్నార్ శత జయంతి వేడుకలోనే అక్కినేని కుటుంబీకులు ప్రకటించారు. అక్టోబర్ 28న నిర్వహించే ఈ అవార్డు ప్రదానోత్సవానికి సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో వేడుకకు ఆహ్వానించేందుకు నాగార్జున శుక్రవారం చిరంజీవిని కలిశారు.