calender_icon.png 14 May, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిప్పర్- బైక్ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

17-03-2025 04:45:42 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలం సమీపంలో టిప్పర్-బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలైన ఘటన సోమవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రధాన రహదారి మూలమలుపు వద్ద ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.