14 March, 2026 | 2:32 PM

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఏఎస్పీ చిత్తరంజన్

14-03-2026 01:22 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఆసిఫాబాద్ పట్టణంలోని పరీక్షా కేంద్రాలు, రెబ్బెన మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ కేంద్రాన్ని ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్  శనివారం పరిశీలించారు.

పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల సమయంలో 163 BNSS (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో గుమికూడకుండా పోలీసులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.కేంద్రాల సమీపంలోని 100 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు పరీక్షల సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట సిఐ లు బాలాజీ వరప్రసాద్,సంజయ్ తదితరులు పాల్గొన్నారు.