13 July, 2026 | 5:26 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

15-05-2026 12:23 AM

మేడిపల్లి సీఐ శంకరయ్య

మేడిపల్లి, మే 14 (విజయక్రాంతి): డ్రగ్స్ వాడకం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుందని, అలాంటి చెడు అలవాట్లకు ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని మేడిపల్లి సీఐ శంకరయ్య అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల జై శ్రీ రా మ్‌కాలనీలో డ్రగ్స్‌పై ఎస్‌ఐ ఉదయ్ భాస్కర్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవ చ్చన్నారు.

మహిళలు, పిల్లలపై నేరాలపై అప్రమత్తత అవసరమన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవిగౌడ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకంతో కుటుంబాలు నాశనమవుతాయని, సంబంధాలు నశించిపోతాయని వాటికి దూ రంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చా రు. క్రీడలు, పుస్తకాలు వంటి మంచి అలవాట్లను దరిచేర్చుకోవాలన్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జై శ్రీ రామ్‌కాలనీ అధ్యక్షులు ఆర్పీ గౌడ్, ఉపాధ్యక్షుడు సందీప్ చారి, జనరల్ సెక్రటరీ పీ సత్యనారాయణ, ట్రెజర్ ఎస్. వెంకట్‌రెడ్డి, కాలనీ వాసులు మ హిళలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.