17 April, 2026 | 3:43 PM

Breaking News

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •  

ఆపరేషన్ కగార్ ను ఆపాలి..

15-06-2025 09:35 PM

అఖిల పక్షం ఆధ్వర్యంలో ఇల్లెందులో పోస్టర్ ఆవిష్కరణ..

ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): అడవుల్లోని ఖనిజ నిక్షేపాలను, వనరులను కార్పొరేట్లకు కట్టబెట్ట చూసే ఆపరేషన్ కగార్(Operation Kagar)ను వెంటనే ఆపాలని శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో జూన్ 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం ఇల్లెందు కొత్త బస్టాండ్ సెంటర్లో అఖిలపక్షాల ఆధ్వర్యంలో పోస్టర్ను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

జూన్ 17న హైదరాబాదులో జరిగే మహాధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ నాయకులు ఎం డి.రాసుద్దిన్,  కొక్కు సారంగపాణి, కొప్పుల శ్రీనివాస్, బొగ్గరపు రాజు, సిపిఐ నాయకులు దేవరకొండ శంకర్, బంధం నాగయ్య, సిపిఎం నాయకులు ఆలేటి కిరణ్, తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, టిడిపి నాయకులు చందావత్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.