బదిలీపై వెళుతున్న డీ.జీ.ఎం పర్సనల్ జీ.వి మోహన్ రావుకు సన్మానం
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్(పర్సనల్) గా పనిచేసి కొత్తగూడెం ఏరియాకు బదిలీపై వెళుతున్న జీ.వి మోహన్ రావును జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య(General Manager V. Krishnaiah), ఇతర అధికారులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వి కృష్ణయ్య మాట్లాడుతూ... జీ.వి మోహన్ రావు గత నాలుగు సంవత్సరాలుగా ఇల్లందు ఏరియాలో పని చేసి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. కొత్తగూడెం ఏరియాలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే ఎస్ .టి. పి. పి శ్రీరాంపూర్ ఏరియా నుండి ఇల్లందు ఏరియాకు బదిలీపై వచ్చిన డిప్యూటీ జనరల్ పర్సనల్ అజ్మీర తుకారం బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం రామస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.






