24 June, 2026 | 6:21 PM

మన ఊరు – మన అంగన్వాడీ కళాజాత

24-06-2026 05:19 PM

నంగునూరు, (విజయక్రాంతి): రిలయన్స్ ,క్రై స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గట్లమల్యాల లో నిర్వహించిన మన ఊరు – మన అంగన్వాడీ కళాజాత కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి,బాలల ఆరోగ్యం,పౌష్టికాహారం,విద్య పై అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక ప్రదర్శనను చేపట్టారు.ఈ సందర్భంగా కళాకారులు ఆటపాటలు, నాటికల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చిన్నారుల సంరక్షణపై చక్కటి సందేశాలను అందించారు.

సర్పంచ్ ఇంగే నరేష్ మాట్లాడుతూ, చిన్నారుల సమగ్ర వికాసానికి అంగన్వాడీలు పునాది అని, గర్భిణీలు, బాలింతలు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిప్పని శ్రీనివాస్,వార్డు సభ్యులు లోకటి సతీష్,నాయకులు, జయ రాములు,ఐసీడిఎస్  సూపర్ వైజర్లు రమాదేవి,రజిత, రిలయన్స్ సూపర్ వైజర్లు నవత,సరిత, సిఆర్ పి శిరీష,అంగన్వాడీ టీచర్లు నిర్మల,రమ,పూజిత,మహిళా సంఘాల నాయకులు,అంగన్వాడీ సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.