ఉపాధ్యాయుల కొరతను అధిగమించి... శతశాతం సాధించి.. కరస్గుత్తి జడ్పీహెచ్‌ఎస్లో వంద శాతం ఉత్తీర్ణత
నాగల్గిద్ద, ఏప్రిల్ 29: నాగల్గిద్ద మండల పరిధిలోని పదవ తరగతి విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం వంద శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారని మండల విద్యాధికారి మన్మధ కిషోర్ తెలిపారు. మండల పరిధిలోని కరస్గుత్తి, నాగల్గిద్ద, కారముంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మోర్గి ఆదర్శ పాఠశాల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణతతో సత్తా చాటారని వెల్లడించారు.
ముఖ్యంగా కరస్గుత్తి జడ్పీహెచ్‌ఎస్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ, ప్రధానోపాధ్యాయులు హీరమన్ ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులకు అదనపు తరగతులు, స్పెషల్ కోచింగ్ ఇచ్చి వంద శాతం ఉత్తీర్ణత సాధించడంలో కీలకపాత్ర పోషించారని ఎంఈఓ ప్రత్యేకంగా ప్రశంసించారు. మండల స్థాయిలో గిరిజన గురుకుల విద్యార్థిని ఆర్.మంజుల 580 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారని ఆయన పేర్కొన్నారు.






