7 September, 2026 | 5:17 AM

15 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు

07-09-2026 | 03:35am

70 లక్షల ఎకరాలకు పెంచేందుకు కృషి: మంత్రి తుమ్మల

అశ్వారావుపేట, సెప్టెంబరు 6,(విజయక్రాంతి) :  భారతదేశంలో ప్రస్తుతం 15 లక్షల ఎకరాల్లో మాత్రమే పామ్ ఆయిల్ సాగు జరుగుతుందని, దీనిని 70 లక్షల ఎకరాల పెంచాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని వ్య వసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు (Minister of Agriculture Tummala Nageswara Rao) అన్నారు. ఆదివారం అశ్వారావుపేట మ ండలం  నారంవారిగూడెంలోని  ఆయిల్ ఫె డ్ కార్యాలయ ఆవరణలో  ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి రైతులకు పామాయిల్ మొక్కలు పంపిణీ చేశారు.

నంతరం అశ్వారావుపేట సమీపంలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు.  గెలల ది గుమతి పెరుగుతుండటంతో   ఎక్కువ సా మర్ధ్యంతో మరో ఫ్యాక్టరీ నిర్మాణం  కోసం పామాయిల్ ఫ్యాక్టరీ లో ఉన్న స్థలాన్ని మ ంత్రి పరిశీలించారు.  ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీ ఎలా నడుస్తుంది అని అధికారాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ ఈ నెల 18 వ తేదీన హైదరాబాద్ లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

పామ్ ఆయిల్ సాగు, మద్దతు ధరతో పాటు, రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి  తెచ్చేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భారత దేశం ప్రతి ఏటా వంట నూనెల దిగుమతి కోసం రెండు లక్షల  కోట్ల రూపాయల ఖర్చు అవుతున్నట్లు మంత్రి తెలిపారు. దేశీయ వంట నూనెల డిమాండ్ తోపాటు విదేశాలకు ఎగుమతి అయ్యేలా పామయిల్ సాగు విస్తరణ చేపట్టాలన్నారు. చీడ పీడలను తట్టుకునేలా కొత్త రకం పామాయిల్ మొక్కలు పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

కొత్త వెరిటీల కోసం మొక్కల పంపిణీ ఆలస్యం అయినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. గెలలు కోతలతో స్తానిక యువతకు ఉపాధి ఏర్పడుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల తలరాత సాగు నీటి ప్రాజెక్టుల తో మారుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా వర ప్రదాయిని అన్నారు.రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు భరోసా గా నిలిచిందన్నారు.

అశ్వారావుపేట ప్రాంతం నాకు రాజకీయ జన్మ  ఇచ్చిందన్నారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా అశ్వారావుపేట అభివృద్ధికి కృషి చేశా అన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ని పంట పొలాలకు  గోదావరి నది జలాలు తెచ్చే బాధ్యత తనదే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అశ్వారావుపేట కు మహర్దశ పట్టిందన్నారు.

కోటగిరి కుటుంబానికి పరామర్శ..

పట్టణంలోని ప్రముఖులు కోటగిరి సీతారామస్వామి  కొద్ది రోజుల క్రితం అల్లుడిని కోల్పయారు. ఆ బాధలో ఉన్న కోటగిరి  కు టుంబాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వర రావు, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ , మున్సిపల్ వైస్  చైర్మెన్ జూపల్లి రమేష్ కలసి పరామర్శించారు.

మరిన్ని వార్తలు