17 June, 2026 | 12:07 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కలిసిన పాల్వంచ బిఆర్ఎస్ పార్టీ నాయకులు

28-06-2025 11:00 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు  ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ను శనివారం  పాల్వంచలో జరిగిన స్వేరోస్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా  పాల్వంచ పాత మున్సిపల్ కార్యాలయం రోడ్ లోని పూర్ణ హోటల్ కు విచ్చేసిన అతన్ని కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా మహిళా నాయకురాలు కాలేరు సింధు తపస్వి తదితరులు మర్యాద పూర్వకముగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ నాయకులతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపుకి 24 గంటలు పని చేయాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలలలోనే ప్రజలలో విశ్వాసం కోల్పోయింది.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని, అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. రాబోయే మూడున్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసే వరకు వారిని నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంగ్లోత్ రంజిత్, మారుమూళ్ళ కిరణ్, కొత్తచెరువు హర్షవర్ధన్, మంగళగిరి పూర్ణ, తోట లోహిత్ సాయి, కాలేరు అఖిల్ మహర్షి, కూరెల్లి మురళీమోహన్, మహమ్మద్ హసీబ్ తదితరులు పాల్గొన్నారు.