4 August, 2026 | 3:01 AM

పారా అథ్లెట్ చందీప్ సింగ్ రికార్డు

04-08-2026 01:14 AM
  1. 7వేల కి.మీ క్రాస్ కంట్రీ డ్రైవ్ పూర్తి
  2. మద్దతుగా నిలిచిన సమర్థ్ బై హ్యుందాయ్

గురుగ్రామ్, ఆగస్టు 3 : పారా అథ్లెట్ చం దీప్ సింగ్ చరిత్ర సృష్టించారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ దాదాపు 7 వేల కిలోమీటర్ల అతి పొడవైన క్రాస్ కంట్రీ డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తిగా చేశారు. ’సమర్థ్ బై హ్యుందాయ్’ కార్యక్రమంలో భాగంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) ఆయనకు మద్ధతుగా నిలిచింది. రెండు చేతులు లేని చందీప్ సింగ్ కో సం హ్యుందాయ్ క్రెటాను ప్రత్యేకంగా రూ పొందించి ఈ సాహసయాత్రకు సహకారమందించింది.

సింగ్ ఈ రికార్డ్ సెట్టింగ్ యా త్రను విజయవంతంగా పూర్తి చేయడం ద్వా రా గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు ద క్కించుకున్నారు. విభిన్న భూభాగాలు, వా తావరణ పరిస్థితులను దాటుతూ ఈ యా త్రను పూర్తి చేసిన చందీప్ సింగ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. చందీప్ సింగ్ ప్రయా ణం పారా అథ్లెట్లకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందని హెచ్‌ఎంఐఎల్ మార్కెటింగ్ హెడ్ విరా ట్ ఖుల్లార్ వ్యాఖ్యానించారు. ఇలాంటి చారిత్రాత్మక ఫీట్‌లో భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. తనకు మద్ధతిచ్చిన హ్యుం దాయ్ ఇండియాకు పారా అథ్లెట్ చం దీప్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాహాసయాత్రతో తన లక్ష్యాన్ని చేరుకోవడం సం తోషంగా ఉందన్నారు.