14 July, 2026 | 12:59 PM

పొలాల్లోకి వెళ్లే దారి కబ్జా చేశారు.!

14-07-2026 12:24 PM

 నాగర్ కర్నూల్ జులై 13 (విజయక్రాంతి): పంట పొలాల్లోకి వెళ్లేందుకు పూర్వం నుండి ఉన్న నక్ష బాటను కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం కబ్జా చేశారని వారిపై తక్షణం చర్యలు తీసుకొని బాటను యధావిధిగా విడిపించాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మరికల్ గ్రామ రైతులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. సర్వేనెంబర్ 299, 297, 305 లలో కొంతమంది వ్యక్తులు నూతనంగా భూమి కొనుగోలు చేసి 18 ఫీట్ల నక్ష బాటను కబ్జా చేసి ఫెన్సింగ్ వేశారని దాని ఫలితంగా సుమారు 30 మందికి పైగా రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వే చేయించినప్పటికీ రాజకీయ,  ధన బలంతో గ్రామంలోని పెద్దలు చెప్పినా వినడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.