5 May, 2026 | 7:08 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

12-02-2025 02:19 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఈరోజు దక్షిణ భారత రాష్ట్రాల్లో తన పర్యటనను ప్రారంభించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడులోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. బుధవారం కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని(Sri Agastya Maharshi Temple) సందర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఆయన కుమారుడు అకీరా నందన్‌, తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు సభ్యుడు ఆనంద్‌ సాయి ఉన్నారు.

అనంతరం సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ మూడు రోజుల పాదయాత్రలో పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడులోని ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. వీటిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం, మధురై మీనాక్షి ఆలయం, శ్రీ పరశురామ స్వామి ఆలయం, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర ఆలయం, స్వామిమలై, తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నాయి.