కొండగట్టు అంజన్న సేవలో పవన్ కల్యాణ్
03-01-2026 12:08 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని( Kondagattu Anjaneya Swamy Temple) సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కొండగట్టు(Kondagattu) ఆలయం అభివృద్ధి కోసం రూ. 35.19 కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేశారు. కొండగట్టులో భక్తుల కోసం టీటీడీ నిధులతో 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ హాల్‌కు పవన్ కళ్యాణ్ భూమిపూజ చేశారు. ఆలయ సందర్శన అనంతరం, పవన్ కళ్యాణ్ నాచుపల్లిలోని ఒక రిసార్ట్‌లో జనసేన పార్టీ కార్యకర్తలను కలిసి, మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.






