పీఠంభూములే
- సమాచార లోపంతోనే గందరగోళం
- శారదా పీఠం అభివృద్ధి,ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా ప్రభుత్వం
- పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకుంటాం.. మాకు భేషజాలు లేవు
- మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల దుష్ప్రచారం
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్/మణికొండ, మార్చి 1 (విజయక్రాంతి): కోకాపేటలోని శారదా పీఠం భూముల వ్యవహారంలో కేవలం సమాచార లోపం వల్లే గందరగోళం తలెత్తిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశా రు. ఆ భూములు పీఠానికే చెందుతాయ ని, ఇందులో ఎలాంటి సందేహం అవస రం లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని, పొరపాట్లు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడు తున్నారని, తమ ఉనికి కోసమే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే..
వాస్తవానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే శారదా పీఠానికి రెండెకరాల భూమిని కేటాయించారు. అక్కడ పీఠం ఆలయ నిర్మాణం చేపట్టడంతో భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల అధికారులు ఈ భూమిని తిరిగి ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఈ భూమిని జలమండలి అవసరాల కోసం కేటాయించే చర్యలు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పీఠం ఆలయ నిర్మాణాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ విషయం బయటకు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తమైంది. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించి శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠంలోని ఆలయ నిర్మాణాన్ని కూల్చకుం డా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబును కోరారు.
మంత్రి శ్రీధర్‌బాబు జోక్యంతో..
ఈ విషయంపై మంత్రి శ్రీధర్‌బాబు వెం టనే జోక్యం చేసుకోవడంతో ఆలయ నిర్మాణాలను కూల్చడంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనికి తోడు సదరు భూమి కూడా శారదా పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పీఠం భూములను జలమండలికి కేటాయించే సమయంలో నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడంపై సీఎం మండిపడ్డారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి నిర్మాణాలు, ఇతర పరిస్థితులను వివరించాలని పీఠం ప్రతినిధులకు సీఎం సూచించారు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం కోకాపేటలోని శారదా పీఠాన్ని శ్రీధర్‌బాబు స్వయంగా సందర్శించారు. అక్కడి రాజశ్యామల అమ్మవారి ఆల యంతో పాటు ఇతర నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఉత్తర పీఠాధిపతి స్వా త్మానందేంద్ర సరస్వతితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేశారు.
పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. అసలు విషయం తెలిసిన వెంటనే భూ ముల విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకున్నామని, రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. కబ్జాకో రుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేస్తుంటే..
అది చూసి ఓర్వలేక కొందరు కావాలనే బురద చల్లుతున్నారని విమర్శించారు. తమది బుల్డోజర్ సంస్కృతి కాదని ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇక బాపు ఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వం ముందుకెళ్తుందని, స్థానికులు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.




