5 September, 2026 | 5:47 AM

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ప్రజా పోరాటం

05-09-2026 | 04:35am

బీఆర్‌ఎస్ పార్టీ వంటావార్పు 

కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కందాళ

నేలకొండపల్లి, ఖమ్మం, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) 1000 రోజుల పాలనలో మహిళలు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి(Kandala Upender Reddy) ఆరోపించారు. నేలకొండపల్లి గ్రామంలోని పీఎస్‌ఆర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్ ప్రభు త్వ 1000 రోజుల వైఫల్య పాలనకు  నిర్వహించిన వంటావార్పులో కందాళ పాల్గొని ప్రసంగించారు. 

రూ.2,500 మహిళా ఆర్థిక సాయం, రూ.500 గ్యాస్ సిలిండర్, తులం బంగారం, వికలాంగులకు రూ.6,000 పెన్షన్ వంటి హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పాలేరు ప్రాంత రైతుల పంటలను కాపాడేందుకు నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత విమర్శలు మాని ప్రజలకు మంచి పాలన అందించాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ప్రజలకు అండగా ఉంటానని కందాళ ఉపేందర్ రెడ్డి  స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు