మళ్లీ పెట్రో మంట
లీటర్ పెట్రోల్‌పై 2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున వడ్డన
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.115.69, డీజిల్ రూ.103.82
ఆయిల్ కంపెనీలు రెండు వారాల్లోనే నాలుగు సార్లు ధరల పెంపు
వాహనదారులపై లీటర్ పెట్రోల్‌పై రూ.7.55, డీజిల్‌పై రూ.7.53 వరకు భారం
మరో రూ.20 నుంచి రూ.33 వరకు పెరిగే అవకాశం
న్యూఢిల్లీ, మే 25: రెండు వారాల లోపే దేశంలో పెట్రో ల్, డీజిల్ ధరలు నాలుగోసారి పెరిగాయి. సోమవారం పెట్రోల్‌పై లీటరుకు రూ.2.84, డీజిల్ ధర లీటరుకు రూ.2.86 మేర చమురు సంస్థలు పెంచా యి. పెంచిన ధరలు సోమవారం ఉదయం 6 గంటల నుం చే అమలులోకి వచ్చాయి. మొదటిసారిగా ఈ నెల 15న పెట్రోల్, డీజిల్ రేట్లను రూ.3 మేర కేంద్రం పెంచింది.
ఆ తర్వాత మే 19న పెట్రోల్ 87 పైసలు, డీజిల్ 91 పైసలు పెరగ్గా, మే 23న కూడా సుమారు 90 పైసల మేర సవరించింది. అంటే మే 15, 19, 23, 25 తేదీల్లో ఇంధన ధరలను సవరించాయి. ఈ మొత్తం పెరుగుదల పెట్రోల్‌పై లీటరుకు రూ.7.35, డీజిల్‌పై లీటరుకు రూ. 7.53గా ఉంది, ఇది సుమారు 7.5 శాతం పెరుగుదలకు సమానం.
పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరిగి, చివరికి నిత్యావసర వస్తువులు, ఆహార ఉత్పత్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని, ఇది పేదలు, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పుడుతుందని విశ్లేషకులు హెచ్చరించారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటంతో ఫిబ్రవరి 28 నుంచి అంతర్జా తీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. కానీ మనదేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా వరుసగా 74 రోజులపాటు ఇంధన ధరలను పెంచకుండా నిలిపివేశారు. భారత్ తన అవసరాల కోసం 88 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటుంది. కానీ ధరలను స్థిరంగా ఉంచడం వల్ల మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలపై ఏకంగా రూ.1.2 లక్షల కోట్లకుపైగా భారం పడింది.








