13 April, 2026 | 6:50 AM

మొక్కలు నాటి సంరక్షించాలి

02-07-2025 01:28 AM

- వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

- కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పిలుపు

కుమ్రం భీం ఆసిఫాబాద్,జూలై 1(విజయ క్రాంతి):ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్క రూ భాగస్వాములై మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పిలుపునిచ్చా రు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం, గిరిజన క్రీడ పాఠశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ భావితరాలకు సహజసిద్ధమైన వాతావరణాన్ని అందించేం దుకు, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కాలుష్యాన్ని నియంత్రించేందుకు చెట్లను కాపాడుకోవాలన్నారు. ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యా లను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  డిటిఓ రామ్ చందర్,  డిఆర్‌డిఓ దత్తారావు,  డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.