ప్రతి దరఖాస్తుపై సమగ్ర పరిశీలన
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, అర్హత ఉన్న అన్ని సమస్య లనూ పరిష్కరించాలని రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తుపై సరైన విచారణ జరపాలని, సంబంధిత వ్యక్తులకు నోటీ సులు జారీ చేయాలని, అవసరమైన డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలన్నింటినీ ఒకే డాక్యుమెంట్‌గా భూభారతి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచిం చారు.
తిరస్కరణకు గురైన దరఖాస్తులను ఎందుకు తిరస్కరించవలసి వచ్చిందో అనే వివరాలను లిఖిత పూర్వకంగా దరఖాస్తుదారులకు అం దించాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై మంగళవారం మంత్రి సమీక్ష జరిపారు. 594 మండలాల్లో 10,226 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, ఇందులో 8,27,230 దరఖా స్తులు వచ్చాయని ఇప్పటి వరకు 7,98,528 దరఖాస్తులను డేటా ఫార్మేట్ ప్రకారం భూభారతి పోర్టల్‌లో నమోదు చేశామన్నారు.
మిగిలిన వాటిని కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. రాష్ర్టం లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కా రం చూపాలన్న సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో భూ భార తి చట్టాన్ని తీసుకువచ్చామన్నారు.




