10 April, 2026 | 7:32 PM

Breaking News

రుద్రారం శివారులో అక్రమ ఇసుక టిప్పర్ సీజ్... ఒకరి అరెస్ట్   •   రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •  

రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ..

15-04-2025 05:42 PM

కొనసాగుతున్న బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు...

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అప్రతిహతంగా కొనసాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 10 రోజుల జయంతి వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేష్, నాయకులు జీదుల రాములు, అనపర్తి సదానందం, గీస రాములు  నాయకులు కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.