3 April, 2026 | 1:59 PM

Breaking News

మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •   బహుజన ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య   •   దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి   •  

24న రైతుల ఖాతాల్లో పీఎం డబ్బులు

20-02-2025 01:06 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: దేశంలోని రైతులకు బీజేపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏడాదికి మూడు విడతల్లో 6వేల రూపాయలు అందించే పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత రూ. 2 వేలను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫిబ్రవరి 24న ప్రధాని మోదీ బీహార్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇందులో భాగంగానే పీఎం కిసాన్ 19వ విడత విడుదల చేయనున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. పీఎం కిసాన్ నిధుల్ని అందుకోవాలంటే అర్హులైన రైతులు తప్పనిసరిగా ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాతో పాటు ఈ కేవైసీ ప్రక్రియను కూడా పూర్తిచేయాలి. లేకుంటే అన్ని అర్హతలు ఉన్నా డబ్బులు జమకావు.