ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని వ్యాపారాలు
12-09-2026 | 07:50pm
ఫుట్‌పాత్, జాతీయ రహదారి అక్రమదారులపై పోలీసులు, మున్సిపల్ అధికారులు మెరుపు దాడి
ఇక మీదట ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తే కేసులు నమోదు
తూప్రాన్,(విజయ క్రాంతి): తూప్రాన్ మున్సిపల్ ఆక్రమంగా ఫుట్‌పాత్(footpath), జాతీయ రహదారిని ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్న ఆక్రమాణదారులపై పోలీసులు, మున్సిపల్ కమిషనర్ మెరుపు దాడి నిర్వహించారు. ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తే ఇకపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్(Municipal Commissioner Ramesh Kumar) అన్నారు. జాతీయ రహదారిని ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తే ట్రాఫిక్ అంతరాయానికి ఆటంకం కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.