calender_icon.png 15 February, 2026 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా పోలో చాంపియన్‌షిప్

15-02-2026 12:24:23 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 14: హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్(హెచ్‌పీఆర్‌సీ) వేదికగా ఇంటర్నేషనల్ అరేనా పోలో చాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మూడోరోజు పోటీల్లో మహిళా రైడర్ల కోసం ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు నిర్వహించారు. దీనిలో మొదటి మ్యాచ్‌లో దివ్యశక్తి ఈగల్స్ 6 స్కోర్‌తో రాధా టీఎంటీ జట్టు పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఇన్హాబిట్ టైగర్స్ 7 స్కోర్ తేడాతో లమర్టీనా పాంథర్స్‌పై గెలుపొందింది.

ఈ అంతర్జాతీయ పోటీల్లో భారత్, యూఎస్‌ఏ, జర్మనీ, ఫ్రాన్స్, లక్సంబర్గ్ జట్లు పాల్గొంటున్నాయి. ఆదివారం ప్రత్యేకంగా వింటేజ్ సూపర్ కార్స్, బైక్స్ ప్రదర్శనతో పాటు ట్రాక్టర్ స్టంట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 18 వరకూ జరగనున్న ఈ పోటీలకు రాధా టీఎంటీ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. హార్స్ పోలోకు మరింత ఆదరణ పెంచడమే లక్ష్యంగా ఈ టోర్నీని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్టు హెచ్‌పీఆర్‌సీ ప్రెసి డెంట్ చైతన్య చెప్పారు.