19 August, 2026 | 4:53 PM

పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

19-08-2026 04:10 PM

శ్రీ శక్తి విధానం తొలగించాలని డిమాండ్

చేగుంట ఆగస్టు 19, విజయక్రాంతి: శ్రీ శక్తి విధానాన్ని తొలగించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేగుంట పట్టణం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు(Polytechnic students protest) రెండో రోజు బుధవారం కళాశాల గేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా విద్యార్థులు మాట్లాడుతూ శ్రీ శక్తి విధానం వల్ల పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యను, ఇతర స్కిల్ డెవలప్మెంట్ విభాగాలను కలపడం వల్ల జూనియర్ ఇంజనీరింగ్  పోదాము కోల్పోయి పాలిటెక్నిక్ గుర్తింపు హోదా పూర్తిగా తొలగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వీలిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారన్నారు, లేకుంటే రాబోయే రోజుల్లో వీలిన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.