గుంతల మయమైన జాతీయ రహదారి

28-09-2026 | 05:25am
  1. తరచూ ప్రమాదాలు 
  2. పట్టించుకోని అధికారులు

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): వరంగల్ జాతీయ రహదారి(Warangal National Highway) గుం తల మాయమైంది. దీంతో ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పో చారం డివిజన్ పరిధిలోని జాతీయ రహదారితో పాటు అన్నోజిగూడలోని ఫ్లైఓవర్ నుం డి సంస్కృతి టౌన్షిప్, ఇన్ఫోసిస్ కంపెనీ వరకు విస్తరించిన రహదారిపైనా గుంతలు కనిపిస్తున్నాయి. దీంతో వాహనాల టైర్లు పగలడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్లకు మరమ్మతులు చేయా లని ఇటీవల స్థానిక నాయకులే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

ఇటీవల పలు మరణాలు సంభవించినా

ఇటీవల జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో వాహనదారులతో పాటు బాటసారులు తీవ్రంగా గాయపడి మృతి చెందినసంఘటనలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. అన్నోజిగూడలోని ఎన్ టి పీ సీ చౌరస్తా వద్ద దంపతులు రోడ్డు దాటుతుండగా వెనక నుండి వచ్చిన కారు ఢీకొనడంతో భర్తకు తీవ్రంగా గాయాలు తగిలి అక్కడికక్కడే మృ తి చెందాడు. అన్నోజిగూడ బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతున్న మహిళను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రమాదం బారిన పడిన మహిళ అక్కడికక్కడే మృత్యు ఒడికి చేరుకోవాల్సి వచ్చింది. అన్నోజిగూడలోని ఎన్టీపీసీ చౌరస్తా వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలోనూ ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలు తగిలాయి. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే మృతి చెందాడు. ఓఆర్‌ఆర్ దగ్గరగా ఉన్న ఢీమార్టు వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

గుంతల వల్ల నియంత్రణ కోల్పోయి

రహదారులపై ఏర్పడిన గుంతల కారణంగా వాహనాలను నడుపుతున్న వారు నియంత్రణ కోల్పోతున్నారు. గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నా యి. ద్విచక్ర వాహనాలు, కార్లు నడిపే వారే కాకుండా సైకిల్ ల వెళ్లే వారు కూడా తరచుగా గుంతల్లో పడి ప్రమాదానికి గురవు తున్నారు. పాత రోడ్లు, మరమ్మతులకు నోచుకోని రహదారులతో ప్రజలు తిప్పలు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.పెరిగిన వాహనాలతో ప్రమాదాలు పెరిగెపట్ట ణీకరణ, నగర విస్తరణతో జనాభా పెరుగుతోంది. దీంతో పాటు వాహనాల సంఖ్య పె రిగింది. వీటి ఫలితంగా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారుతోంది. అదేవిధంగాప్రమా దాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి.

సజీవంగా చేరుకోండి

అరైవ్ అలైవ్ (సజీవంగా చేరుకోండి) వంటి కార్యక్రమాల తో ప్రమాదాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటు రహదారుల మర మ్మతులపై దృష్టి సారించాలని ప్రజలు కో రుతున్నారు. దుమ్ము, ధూళి, కంకర రాళ్లతో పాటు ఇతర రాళ్లు పడితే వెంటనే తొలగించి శుభ్రం చేయడంలేదని వాహనదారులు వా పోతున్నారు. అన్ని ప్రమాద ఘటనల్లోనూ అతివేగం, నిద్రమత్తు, అజాగ్రత్త, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవ డం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవర్ల నిర్ల క్ష్యం ఉండదని, రహదారుల స్థితిగతులు కూ డా కారణాలవుతాయని వాహనచోదకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు