ప్రజావాణికి ప్రజల స్పందన
కాగజ్నగర్,(విజయక్రాంతి): కాగజ్నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani ) కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఎంపీడీవో సీహెచ్ ఉజ్వల్ కుమార్(Kagaznagar MPDO CH Ujjwal Kumar) మొత్తం 9 దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లకు 3, ఆసరా పింఛన్లకు 3, మున్సిపాలిటీకి సంబంధించినవి 2, రెవెన్యూకు సంబంధించి ఒక దరఖాస్తు ఉన్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజేందర్, హౌసింగ్ ఏఈ జలంధర్, ఉపాధి హామీ ఏపీవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి)లో 9 దరఖాస్తులు
సిర్పూర్(టి) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 9 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో కోట ప్రసాద్ తెలిపారు. ఇందులో భూ సమస్యలకు సంబంధించి 7, ఇందిరమ్మ ఇళ్లకు ఒకటి, అటవీ భూములకు సంబంధించి ఒక దరఖాస్తు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.