అఖిల్ సాయికి ప్రతిభా పురస్కార్ -2026 అవార్డు ప్రదానం
అలంపూర్ మే 19:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఐ ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు -2026 పేరిట ప్రతిభ పురస్కార్ అవార్డులను ప్రధానం చేస్తోంది. 600 మార్కులకు గాను 560 పైచిలు మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ అవార్డులను అందజేస్తారు.ఈ క్రమంలో గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను 561 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనపరిచి మండల టాపర్ నిలిచిన అఖిల్ సాయి ప్రతిభ పురస్కార్ అవార్డును అందుకున్నారు.
ఈ మేరకు స్థానిక ఎంఈఓ శివప్రసాద్ తో కలిసి మంగళవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీదుగా ప్రశంస పత్రంతోపాటు అవార్డును అందుకున్నారు.అంతేకాక విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధించే విధంగా దిశా నిర్దేశం చేసిన ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ శివప్రసాద్ ను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తండ్రి నాగరాజు తదితరులు ఉన్నారు






