16 April, 2026 | 5:56 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

నాగిరెడ్డిపేట్ మండల జాగృతి పద్మశాలి అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ నియామకం

16-04-2026 04:12 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట్ మండల జాగృతి పద్మశాలి అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్‌ను నియమించారు.ఈ సందర్భంగా నూతన నూతనంగా మండల జాగృతి పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి  ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...తనపై నమ్మకంతో మండల జాగృతి పద్మశాలి సంఘం అధ్యక్షులుగా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ద్మశాలి సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.మండలంలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు యువతను సమీకరించి సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు.కామారెడ్డి జిల్లా జాగృతి అధ్యక్షుడు సంపత్ గౌడ్ మాట్లాడుతూ...మండల జాగృతి పద్మశాలి సంఘం నూతనంగా ఎన్నికైనటువంటి ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో మండలంలో సంఘ కార్యకలాపాలు మరింత చురుకుగా కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.సభ్యులంతా ఐక్యంగా పని చేస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బాగారెడ్డి,మండల యువ అధ్యక్షుడు ఫహీమ్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీను,మండల మైనారిటీ అధ్యక్షుడు ఎజస్ తదితరులు పాల్గొన్నారు.