బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
గద్వాల, (విజయక్రాంతి): గద్వాల జిల్లాలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్బంగా గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్, పార్టీ సీనియర్ నాయకులను ని పట్టణ పోలీసులు తెల్లవారు జామున వారి ఇంటి లోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ.... ప్రజా పాలనలో పోలీస్‌ల పహారాలు, నిర్బంధాలు ఎందుకని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు? ప్రజా ప్రభుత్వం అంటూ బీఆరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఈ అంక్షలు ఎందుకు అని ఆయన నిలదీశారు. మూడు సంవత్సరాల పాలనకే ఇంత అభద్రతాభావమా, ఇంతటి అరాచకమా? అని ఆయన మండిపడ్డారు. తమకు కొట్లాడటం కొత్తకాదని కేవలం పెండింగ్ ప్రాజెక్టులపై సూచనలను ప్రజల కోణంలో విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహా కేబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు విహార యాత్ర కోసం ఎగవేసుకుని వస్తున్నారని అయినప్పటికీ గద్వాలకు సీఎం వస్తున్నాడన్న వాతావరణమే ఎక్కడా కనిపించడం లేదని ఆయన విమర్శించారు.






