23-04-2025 09:43:34 AM
జమ్ముకశ్మీర్: పహల్గాం ఉగ్రదాడి(Pahalgam attack) ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మినీ స్విట్జర్లాండ్(Mini Switzerland)గా పేరొందిన బైసరన్ కు వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేశారు. నిన్న ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సౌదీ పర్యటన అర్ధవంతరంగా రద్దు చేసుకున్నారు. బుధవారం నాడు మోడీ అధ్యక్షతన భద్రతావ్యవహారాల కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ నేడు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. జమ్ముకశ్మీర్ ఉగ్రదాడి ఘటన గురించి డొనాల్డ్ ట్రంప్ ఆరా తీశారు. ప్రధాని మోదీకి బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానులు ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై స్టార్మర్, ఆంథోని ఆల్బెనెస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.