14 March, 2026 | 12:42 PM

దేశంలో గ్యాస్ కొరత లేదు

14-03-2026 11:32 AM

హైదరాబాద్: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల అనేక దేశాల్లో గ్యాస్ ధరలు పెరిగాయని, మన దేశంలో మాత్రం గ్యాస్ ధరలు పెరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(BJP President N Ramchander Rao) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. దేశంలో గ్యాస్ కొరత లేదని ఆయన వెల్లడించారు. కావాలనే గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సామాన్యుడికి ఇబ్బందులు లేకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలను నియంత్రణలో పెట్టిందని రామచందర్ రావు వివరించారు.

తంలో గ్యాస్ ధరలు(Gas Prices) రూ. 1200 ఉంటే, మోదీ ప్రభుత్వం(Modi Government) రూ. 900 చేసిందని చెప్పారు. అబద్దాలతో ప్రజలను భయపెడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవనానికి రూ. 7 వేల కోట్లు అంటున్నారు. మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదన్న రామచందర్ రావు( Ramchander Rao) మూసీలో పడే డ్రైనీజీ నీటిని ఎలా ఆపుతారని ప్రశ్నించారు. 50 మీటర్ల బఫర్ జోన అనేది అవసరం లేదని రామచందర్ రావు తేల్చిచెప్పారు. గాంధీ విగ్రహానికి 100 ఎకరాలు కావాలా? అని రామచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.