25 May, 2026 | 10:22 PM

తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి: టియూజేఏసీ నేతల

25-05-2026 09:29 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని మున్నూరుకాపు సంఘం హాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టియూజేఏసీ చైర్మన్ సల్తాన్ యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.

అలాగే ఉద్యమకారులకు నెలకు రూ.25 వేల పెన్షన్, 100 ఎకరాలతో అమరుల స్మృతి వనం ఏర్పాటు చేయాలని, రూ.1 కోటి సబ్సిడీ రుణం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించి సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఉద్యమకారుల మహాసభను భారీ ఎత్తున నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.