17 March, 2026 | 8:50 PM

సింగరేణిలో నల్లబ్యాడ్జీలతో నిరసన

17-03-2026 07:27 PM

- సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉదృతం చేస్తాం

- మిర్యాల రంగయ్య

- అధికారులకు వినతి పత్రం అందించిన గుర్తింపు సంఘం

- కార్యాచరణ వాల్ పోస్టర్ విడుదల

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణిలో కార్మిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసి) గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో కార్పొరేట్ ఏరియాలోని అన్ని డిపార్ట్మెంట్లలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసి) అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా యాజమాన్యం కాలయాపన చేస్తోందన్నారు.

సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆందోళన కార్యక్రమాలకు పిలుపిచ్చినట్లు చెప్పారు. కొన్ని సమస్యలనువ యాజమాన్యం స్ట్రక్చర్ సమావేశాల్లో అంగీకరించినప్పటికీ ఇంత వరకు వాటి అమలుకు సర్క్యులర్ జారీ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రధానంగా మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్య, సొంత ఇంటి పథకం, పెర్మ్స్ పై ఇన్కం టాక్స్ సమస్య, డిస్మిస్ కార్మికులకు అవకాశం కల్పించాలని కోరారు.

యాజమాన్యం సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. భవిష్యత్ కార్యచరణపై వాల్పెస్టర్ విడుదల చేశారు. ఈనెల 18 నుండి 30 వరకు గోలేటి నుండి కొత్తగూడెం వరకు బస్ జాతా ప్రారంభం అవుతుందని, 30న సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను, ఏప్రిల్లో జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపనిచ్చారు. జరగబోయే ఆందోళన కార్యక్రమాల్లో కార్మికులు అంధిక సంఖ్యలో పాల్గొని సంస్థ మనుగడ కోసo పాటుపడాలని కోరారు.