27 March, 2026 | 1:09 PM

బోణీ కొట్టిన పంజాబ్

26-03-2025 01:38 AM

గుజరాత్‌పై విజయం

అహ్మదాబాద్, మార్చి 25: ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (97 నాటౌట్), శశాంక్  (44 నాటౌట్) చెలరేగారు. సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (74) టాప్ స్కోరర్‌గా నిలిచాడు .పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ ౨ వికెట్లు పడగొట్టాడు.