30 June, 2026 | 11:41 AM

సింధు ఔట్

06-06-2024 12:23 AM

జకర్తా: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఇండోనేషియా ఓపెన్ తొలి రౌండ్‌లోనే పరాజయం పాలైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ టోర్నీ మొదటి రౌండ్‌లోనే సింధు ఇంటి బాటపట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి పోరులో సింధు  15 21 14 సు వెన్‌ (చైనా) చేతిలో  ఓడింది. ఇటీవల మలేషియా మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు సింగపూర్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమైంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప కాస్ట్రో జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో అశ్విని జోడీ 21 21 జాకీ డెంట్ లాయ్ (కెనడా)ని చిత్తు చేసి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. కేవలం 34 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన ఈ జోడీ రెండు గేముల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.