వైశాలీ విజయం
స్టావెంజర్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ వైశాలీ నార్వే చెస్ టోర్నీలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం మహిళల విభాగంలో 8వ రౌండ్‌లో వైశాలీ ఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అన్నా ముజిచుక్‌ను టోర్నీలో రెండోసారి ఓడించింది. మొదట క్లాసికల్ గేమ్‌ను డ్రా చేసుకున్న వైశాలీ కీలక ఆర్మ్‌గెడాన్ పోరులో ముజిచుక్‌ను మట్టికరిపించింది. ఈ విజయంతో వైశాలీ 11.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. కోనేరు హంపి చైనా గ్రాండ్‌మాస్టర్ టింగ్‌జి లీ చేతిలో ఓటమిపాలైంది. పురుషుల విభాగంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద ఓటమి చవిచూశాడు. 8వ రౌండ్‌లో స్థానిక ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌తో తలపడిన ప్రజ్ఞానంద క్లాసికల్ గేమ్‌ను డ్రా చేసుకున్నప్పటికి ఆర్మ్‌గెడాన్ పోరులో క్లార్ల్‌సన్‌కు తలవంచాడు. కాగా ప్రజ్ఞానంద తొలి రౌండ్‌లో కార్ల్‌సన్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే.






