30 June, 2026 | 12:28 PM

నెదర్లాండ్స్ బోణీ

06-06-2024 12:21 AM

డల్లాస్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత  నేపాల్ 19.2 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డచ్ బౌలర్లలో టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్య చేధనలో నెదర్లాండ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి విజయం సాధించింది. మాక్స్ ఒ డౌడ్ (48 బంతుల్లో 54 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) మెరిశాడు. టిమ్ ప్రింగిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు.