జాతీయ రహదారుల కోసం కేంద్ర మంత్రికి వినతి
కాగజ్ నగర్,(విజయక్రాంతి): న్యూఢిల్లీలో కేంద్ర రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) అధికారిక నివాసంలో శుక్రవారం మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కలిశారు. ఈ సందర్భంగా వారిని హైదరాబాద్ - నాగపూర్ నూతన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం, బెల్లంపల్లి గడ్చిరోలి నూతన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం విషయంలో అలైన్మెంట్ ఖరారు చేసి పనులు ప్రారంభించాలని కోరారు.
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి హైదరాబాద్ - నాగ్ పూర్ నూతన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే కోసం అలైన్మెంట్ ఖరారు చేసే పనిలో ఉన్నామని తెలిపారు. అలాగే బెల్లంపల్లి - గడ్చిరోలి జాతీయ రహదారి విషయంలో ఫారెస్ట్ అనుమతుల విషయంలో ఉన్న సమస్యలను అధిగమిస్తామని కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిపారు.




