రెహమాన్ బాటలోనే ఆయన లేడీ అసిస్టెంట్!
పరస్పర అంగీకారంతో ఏఆర్ రెహమాన్, ఆయన భార్య సైరా బాను విడిపోతు న్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. వారి విడాకుల వ్యవహారంపై వారి తరుఫు న్యాయవాది వందనా షా ఒక ప్రకటన విడు దల చేశారు. రెహమాన్ సైతం విడాకుల వ్యవహారంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని భావించాం. కానీ ఇంతలోనే ముగింపు పలకాల్సి వచ్చింది.
పగిలిన ముక్కలు అతుక్కోలేవు. దీంతో మా దారులు వేరయ్యాయి. స్నేహితులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’ అని వెల్లడించారు. ఏఆర్ రెహమాన్, సైరా బాను వివాహం 1995లో జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆసక్తికర విషయమేంటంటే రెహమాన్ విడాకుల అంశాన్ని ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన శిష్యురాలు మోహిని డే కూడా తన విడాకుల అంశాన్ని ప్రకటించారు.
ఆమె రెహమాన్ దగ్గర బాసిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆమె కూడా మంగళవారం సాయంత్రం తన భర్తకు విడాకులిచ్చారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రాం వేదికగా మోహిని ప్రకటించారు. గంటల వ్యవధిలో గురు శిష్యులిద్దరూ విడాకుల విషయాన్ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.






