25 July, 2026 | 8:26 PM

గిరిజన గురుకుల కళాశాలలో 28న ఇంటర్ స్పాట్ అడ్మిషన్లకు కౌన్సెలింగ్

25-07-2026 07:52 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ రీజియన్ లో గల గిరిజన గురుకుల కళాశాలల యందు 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరము లో మిగిలిన సీట్లకు ఈ నెల 28 న మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఆర్ సి ఓ రత్నకుమారి తెలిపారు. గిరిజన సంక్షేమ గురుకులాల సంస్థ సెక్రెటరీ కే.సీతా లక్ష్మి ఆదేశాల అనుసారము మరిపెడ కాలేజీ నందు నిర్వహించే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశం కోసం అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10.00 గంటలకు విద్యార్థిని విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరు కావలసినదిగా ఆమె కోరారు. మహబూబాబాద్, దామరవంచ, మరిపెడ, రెడ్యాల, కేసముద్రం జూనియర్ కళాశాలలో వివిధ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు.