తుమ్మలచెరువు ఆయకట్టుకు సీతారామ కెనాల్ ద్వారా తక్షణమే నిళ్లు ఇవ్వాలి
25-07-2026 08:02 PM
అశ్వాపురం,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని తుమ్మలచెరువుకు నీరు చేరకపోవడంతో ఖరీఫ్ పంటలను కాపాడేందుకు సీతారామ కెనాల్ ద్వారా కుందారం, చదలవాడ, ఊరవాయ కాలువలకు తక్షణమే నీరు విడుదల చేయాలని నెల్లిపాక సొసైటీ మాజీ అధ్యక్షుడు మర్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయకట్టు రైతులతో కలిసి ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో కలిసి మూడు కాలువల వద్ద సీతారామ కెనాల్ నుంచి నీరు అందించే అవకాశాలను పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున అధికారులు త్వరితగతిన నిర్ణయం తీసుకుని ఆయకట్టు రైతులకు నీరు అందించాలని కోరారు.






