సీఈసీ అప్రూవర్‌గా మారాలి

02-10-2026 | 05:00am
  1. ఫారం 7లో ఎవరి ఆదేశాలతో మార్పులు చేశారు?
  2. ముస్లిం ఓటర్ల వివరాలతో ఫారం 7 దరఖాస్తులు దొరికాయ్
  3. ఆ ముగ్గురి వల్ల ప్రజాస్వామ్యం నాశనం
  4. ఈసీ, కేంద్రంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఓటరు నమోదు ఫారం ఫారం 7లో మార్పులు ఎవరి ఆదేశాలతో చేశారు? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో ఈ మార్పులు చేయిం చింది ఎవరు? సంస్థపై ఒత్తిడి తెచ్చింది ఎవరు? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi) ఈసీని, కేంద్ర ప్రభుత్వా న్ని నిలదీశారు. ఎస్‌ఐఆర్ ద్వారా ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్‌షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నా రని, వారు దేశద్రోహానికి పాల్పడుతున్నారని రాహుల్‌గాంధీ తీవ్రంగా ఆరోపించారు.

సీఈసీ జ్ఞానేష్‌కుమార్(CEC Gyanesh Kumar) రాజీనామా చేసి అప్రూవర్‌గా మారాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా వరుస పోస్టులు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. సర్‌లో భాగంగా ఫారం-6కు అదనపు డిక్లరేషన్‌ను జోడించడంపై ఇటీవల వివాదం చెలరేగింది. ఈ డిక్లరేషన్‌లో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వారు లేదా తమ తల్లిదండ్రులు/తాత ముత్తాతలకు గతంలో జరిగిన ప్రత్యేక సవరణల ఓటర్ల జాబితాలతో ఉన్న సంబంధానికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంది.

ఈ అదనపు నిబంధనపై ఎన్నికల కమిషనర్లు ఎస్‌ఎస్ సంధూ, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో వివాదం మరింత ముదిరింది. మరోవైపు సర్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ కమిషన్‌లో ఏకగ్రీవంగానే తీసుకు న్నట్లు ఈసీ వెల్లడించింది. సర్ ప్రక్రియ చేయబడిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఫారం-6కు జత చేసిన అదనపు డిక్లరేషన్‌ను సెప్టెం బర్ 30 నుంచి ఈసీ తొలగించింది. అక్కడ ఇక సాధారణ చట్టబద్ధమైన ఫారం-6 మాత్రమే నింపాల్సి ఉంటుంది.

ఈ పరిణామాల నేపథ్యం లో ఫారం6లో అసలు మార్పులు ఎవరికి అనుగుణంగా, ఏ ప్రక్రియ ద్వారా, ఏ అధికారిక అనుమతితో జరగాలనే అంశంపై స్పష్టత ఇవ్వా లని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆయన ప్రశ్నలు ప్రస్తుతం ఈసీ వ్యవస్థలో నిర్ణయాలు తీసుకునే విధానం, సాంకేతిక అమలుపై రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ ముగ్గు రూ కలిసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ద్వారా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని, వారు దేశద్రోహా నికి పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

సీఈసీ రాజీనామా చేసి అప్రూవర్‌గా మారాలని డిమాండ్ చేశారు. అలాగే మోదీ, షాలపై విచారణ జరపాలని పిలుపునిచ్చారు. ముస్లిం ఓటర్ల వివరాలతో ఇప్పటికే ముద్రించిన ఫారం 7 దరఖాస్తులు ఇప్పుడు బెళగావిలో దొరికాయని, బూత్ లెవెల్ ఏజెంట్‌తో సహా తమకు బాగా తెలిసిన వ్యక్తుల పేర్లను తొలగించాలని కోరుతూ ఫారాలపై సంతకాలు చేయమ ని తమపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఈ మేరకు బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఓలు) చెప్పినట్లు ‘ఎక్స్’లో వచ్చిన ఒక పోస్టుకు ప్రతిస్పం దనగా రాహుల్ తెలిపారు.

ఓటు దొంగతనంపై యావత్ దేశం ఆగ్రహంతో ఉన్నా.. కూడా బీజేపీ-, ఈసీలు దుర్మార్ఘానికి ఒడిగడుగుతున్నాయని ఆరోపించారు. వా రు ఇంకా ఓట్ల చోరీ పనులు చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. కర్ణాటకలోని బెళగావిలో, దాదాపు 15,000 మంది ఓటర్ల పేర్లను ఒక్క దెబ్బతో చెరిపివేయడానికి ఒక కుట్ర జరిగిందని విమర్శించారు.మూడు రోజుల్లోనే (గత నెల 22, 23, 24 తేదీల్లో) ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు