2 March, 2026 | 2:09 PM

రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదు

02-03-2026 12:52 PM

రేవంత్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్

హైదరాబాద్: ఇందిరా పార్క్ ధర్నా చౌక్(Indira Park Dharna Chowk) వద్ద బీజేపీ నిరహార దీక్ష చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలని నిరాహార దీక్షకు దిగింది. నిరహార దీక్షలో తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(Telangana BJP chief Ramchandra Rao), కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.

ధర్నాలో రామచందర్ రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి(Rahul Gandhi) రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఆరు గ్యారెంటీలు ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో అనేక సమస్యలున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి(Revanth Reddy Government) రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ చీఫ్ ఎద్దేవా చేశారు. విశ్రాంత ఉద్యోగులకు(Retired employees) బీజేపీ అండగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.