30 April, 2026 | 2:46 AM

రాహుల్ విజ్ఞాన విద్యాలయం విద్యార్థుల ప్రభంజనం

30-04-2026 01:12 AM

63 మంది విద్యార్థులకు 62 మంది ఉత్తీర్ణత

అభినందించిన వ్యవస్థాపకులు డాక్టర్ బి.యన్ కుమార్, ప్రతిభ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాస్త్రి, ప్రిన్సిపాల్ రాజు వర్మ.

చర్ల, ఏప్రిల్ 29, (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో రాహుల్ విజ్ఞాన్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన విద్యాలయం ప్రిన్సిపాల్ రాజు వర్మ బుధవారం తెలిపారు. చర్ల మండల కేంద్రంలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ  పదవ తరగతి ఫలితాలలో రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థులు అద్భుతమైన విజయాన్ని సాధించారు.

573 మార్కులతో పి.నిశాంత్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచాడు. (చర్ల మండల స్థాయిలో ద్వితీయ స్థానం ) 566 మార్కులతో ఎం. మెహరాజ్  ద్వితీయ స్థానంలో నిలిచాడు. 558 మార్కులతో పి.సాయి తేజ తృతీయ స్థానంలో నిలిచాడు. మొత్తం 63 మంది విద్యార్థులలో 62 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 

500 కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 16.  450 నుండి 499 వరకు మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 18. 400 నుండి 449 వరకు మార్కులు లు సాధించిన విద్యార్థుల సంఖ్య 23. 350 నుండి 399 వరకు మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 5 ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన విద్యార్థులను పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ డి. ఎన్.కుమార్,డాక్టర్ డి.ప్రతిభ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాస్త్రి, ప్రిన్సిపాల్ వర్మరాజు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.