రైల్వేలో ఎల్‌ఎన్‌జీ తొలికూత

28-09-2026 | 05:10am
  1. గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్ నుంచి పరుగు
  2. 99.6శాతం రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణ పూర్తి
  3. మోదీ హయాంలో రైల్వేల ఆధునీకరణ
  4. కాంగ్రెస్ మాత్రం కుంభకోణాలకు పాల్పడింది
  5. రూ.15వేల కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టుల ప్రారంభంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా

అహ్మదాబాద్, సెప్టెంబర్ 27: గుజరాత్‌లోని సబర్మతి స్టేషన్ (Sabarmati Station)నుంచి దేశపు తొలి ఎల్‌ఎన్జీ రైలును కేంద్ర హోమంత్రి అమిత్‌షా ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) రైల్వేల రూపురేఖలు మార్చేశారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో కుంభకోణా లు తప్ప మరేమీ చేయలేదని విమర్శించారు. 12 ఏళ్లలో మోదీపై నాలుగు ఆణాల అవినీతి ఆరోపణ కూడా ఎవరూ చేయలేకపోయారని తేల్చిచెప్పారు. అర్థంలేని మాటలు మాట్లాడే కాంగ్రెస్‌ను వాస్తవాలు, గణాంకాల ఆధారంగా చర్చకు సవాలు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

కర్బన ఉద్గారాలను వేగంగా తగ్గించే ప్రాజెక్టులకు భారత్ వేదికగా నిలుస్తుందని చెప్పారు. త్వరలోనే భారత్ వందశాతం రైల్వే నెట్‌వర్క్ విద్యుదీకరణను పూర్తి చేస్తామని చెప్పారు. అనంతరం జరిగిన ఒక సభలో అమిత్‌షా మాట్లాడారు. 2014కు ముందు, ఈ దేశాన్ని ఒకే కుటుంబం పాలించిం దని, తాను రైల్వేల గురించి మాత్రమే మాట్లాడు తానని తెలిపారు. ప్రత్యేక సరుకు రవాణా కారిడార్, ర్యాపిడ్ రైల్ సిస్టమ్, ప్రీమియం స్టేషన్లు, ఇవన్నీ మోదీజీ ప్రారంభించినవే.

అంతేకాక, హైడ్రోజన్‌తో నడిచే రైలును ప్రారంభించడం ద్వారా, మోదీ భారతదేశాన్ని ప్రపంచంలోని కేవలం 4 దేశాల సరసన నిలబెట్టారని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పనికిమాలిన మాటలు మాట్లాడు తుంది. దేశ ప్రజలు వారిని గణాంకాలతో చర్చించమని అడగాలి. కాంగ్రెస్ రూ.12 లక్షల కోట్ల మోసాలు, కుంభకోణాలు, అవినీతి తప్ప మరేమీ చేయలేదు. కానీ 12 ఏళ్లలో మోదీపై నాలుగు అణాల అవినీతి ఆరోపణ కూడా ఎవరూ చేయలేకపోయారు’ అని తెలిపారు.

షా సబర్మతిస్టేషన్ నుంచి వాగ్-12 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ను ప్రారంభించడంతో పాటు, రూ.1500 కోట్లకు పైగా విలువైన ప్రధాన రైల్వే ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో, 11,000 కిలోమీటర్ల రైల్ కారిడార్‌ను 4-ట్రాక్ నెట్‌వర్క్ గా మార్చే పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రైళ్లలో 97 శాతం బయో-టాయిలెట్లను ఏర్పాటు చేశామని, 87 శాతం ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు దేశంలోనే తయారు చేశామని చెప్పారు.

‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ను బలోపేతం చేశామని, 2030 నాటికి డీజిల్ వినియోగంలో సున్నాకి చేరుకుంటామని చెప్పారు. రైల్వేలో 99.6 శాతం విద్యుదీకరణ పూర్తుందని, మిగిలిన 0.3 శాతాన్ని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేవారు. విద్యుదీకరణ విషయంలో చైనాలో 92 శాతం, స్పెయిన్‌లో 68 శాతం, ఫ్రాన్స్‌లో 60 శాతం, బ్రిటన్ వంటి చిన్న దేశంలో 49 శాతం పురోగతి ఉందన్నారు. భారతదేశంలో దీనిని 100 శాతానికి చేరుకుంటామన్నారు. 

మరిన్ని వార్తలు