26 March, 2026 | 8:26 PM

వర్షాలకు దెబ్బతిన్న మట్టి రోడ్లను పూర్తి చేయాలి

08-02-2025 07:38 PM

సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి..

కొండపాక (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్, డిఆర్డిఓ శాఖ అధికారులతో కలెక్టర్ మను చౌదరి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ... జిల్లాలోని పంచాయతీ రాజ్ శాఖ, ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపడుతున్న పనులు సిసి రోడ్లు, డ్రైనేజ్, అంగన్వాడి, గ్రామపంచాయతీ భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం పనులు, జిల్లాలో వర్షాలకు కొట్టుకుపోయిన మట్టి రోడ్ల పనులను గుర్తించి, వాటికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఈనెల చివరికల్లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదివరకు పూర్తి అయిన పనులకు ఎఫ్టిఓ జనరేట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, ఎన్ఆర్ఈజీఎస్ లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే డిఆర్డిఓ అధికారులకు తెలిపి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఢిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.