26 March, 2026 | 7:33 PM

పేద కుటుంబానికి ఉచిత వైద్యం

26-03-2026 06:04 PM

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండల కేంద్రానికి చెందిన రమణ నిరుపేద దంపతులకు ఉచిత వైద్యాన్ని నిర్మల్ సప్న హాస్పిటల్ అందించారు. సప్నా హాస్పిటల్ వైద్యులు నాలం స్వప్న, శశికాంత్ కుటుంబ పరిస్థితి కారణంగా రమణ భార్య డెలివరీ ఆపరేషన్ ద్వారా నిర్వహించి తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం నాలుగు రోజులు ఉచితంగా వైద్యాన్ని హాస్పిటల్లో అందించారు. ఉచిత వైద్యాన్ని అందించిన వైద్య దంపతులకు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.